సల్మాన్ ఇంటి బయట కాల్పులుకి డబ్బు ఎంతో తెలుసా.. జైలు నుంచే స్కెచ్
on Apr 18, 2024
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సల్మాన్ ఖాన్ కి ఉన్న చరిష్మా గురించి అందరి తెలిసిందే.మూడు దశాబ్దాల నుంచి పవర్ ఫుల్ యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులని అలరిస్తు వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇంటి వద్ద కాల్పులు జరిపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సంఘటనలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
సాగర్ పాల్,విక్కీ గుప్తా..బీహార్ కి చెందిన వీళ్ళిద్దరే సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపారు.కొన్ని రోజుల క్రితం పోలీసులు బీహార్ వెళ్లి అరెస్ట్ చేసి ముంబై కి తీసుకొచ్చారు. విచారణలో పలు విషయాలలు బయటకి వచ్చాయి. కాల్పులు జరపడానికి 4 లక్షలకి బేరం కుదుర్చుకొని లక్షరూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు సల్మాన్ ఇంటి బయట రెక్కీ నిర్వహించారు. రంజాన్ రోజు కూడా రెక్కీ నిర్వహించారు.కేవలం డబ్బు కోసమే కాల్పులు జరిపారు ఈ విషయాలన్నీ నింధుతులే చెప్పారు .
ఇక ఆ సంఘటన జరిగినప్పుడు సల్మాన్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. దాంతో వాళ్లంతా ఒక్కసారిగా భయబ్రాంతులకి లోనయ్యారు.నింధితులు మొత్తం 5 రౌండ్లు కాల్పులు జరిపారు. బీహార్ మనుషుల చేత ఆ పని చేయించింది జైలు లో ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ పని అని తెలుస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సల్మాన్ ని కలిసి ధైర్యాన్ని చెప్పారు.
Also Read